TDP: కార్యకర్తలకు అండగా పార్టీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:50 PM
కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు.
టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్
ముదిగుబ్బ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు. దీంతో గంగులప్ప కుటుంబానికి మంజూరైన రూ.5లక్షల ప్రమాద బీమా పత్రాన్ని పరిటాల శ్రీరామ్ అనంతపురం లోని తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు. ఇది పార్టీ నుంచి అందుతున్న సాయం మాత్రమేనని... భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబసభ్యులు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జ్ తుమ్మల మనోహర్, నాయకులు చినగాని నరసింహ యాదవ్, బండి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.