PRINTER: సచివాలయంలో పని చేయని ప్రింటర్
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:38 PM
మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామ సచివాలయం.
నల్లచెరువు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామం సచివాలయం. దీంతో ఆ రెండు పంచాయతీల్లో ఆరు గ్రామాల ప్రజలు పలు కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలతో పాటు 1-బి, ఇంటి స్థలాల పట్టాల కోసం ఈ గ్రామ సచివాలయానికి వెళ్తుంటారు. అయితే ఇక్కడ ప్రింటర్ పనిచేయక పోవడంతో నిరాశతో వెనుదిరుగుతు న్నారు. అయితే చేసేదేమీలేక గ్రామం నుంచి మూడు కిలోమిటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆయా గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక్కడ ప్రింటర్ పనిచే యడం లేదని మండల అధికారులకు పలు మార్లు తెలిపినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సచివాలయ సిబ్బందే బహిరంగంగా ప్రజలకు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రింటర్ బాగు చేయించాలని ఆ రెండు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....