GOD: ఘనంగా దేవతా విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:46 PM
మండల పరిధిలోని కమ్మవారిపల్లిలో బుధవారం అభయాంజనేయస్వామి, మహాగణప తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు వాల్మీకి పవనకుమార్ రెడ్డి, మండల కన్వీనర్ రాజశేఖర్‌బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
నల్లచెరువు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కమ్మవారిపల్లిలో బుధవారం అభయాంజనేయస్వామి, మహాగణప తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు వాల్మీకి పవనకుమార్ రెడ్డి, మండల కన్వీనర్ రాజశేఖర్‌బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా మూడు రోజుల నుంచి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిరు. బుధవారం యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ అనంతరం విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అలం కారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. టీడీపీ మండల మాజీ కన్వీనర్ దాదం వెంకటశివారెడ్డి, మాజీ ఎంపీపీ దాదెం శ్యామలమ్మ, నాయకులు మధుసూదనరెడ్డి తదితర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....