GOD: ఘనంగా అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:16 AM
పట్టణంలోని కేశవనగర్‌లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్‌కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
ధర్మవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కేశవనగర్‌లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్‌కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రా మాల నుంచి వచ్చిన 600 మందికిపైగా కన్నెస్వాములచే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గురుస్వామి తెలిపారు. అనంతరం గణపతి, నవగ్రహ, శాంతిహోమాలు నిర్వహించారు. ఆదివారం అయ్య ప్పస్వామి గ్రామోత్సవం, అన్నదాన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
రేపటి నుంచి మండల పూజ
కదిరి అర్బన: పట్టణంలోని అయ్యప్ప నగర్‌లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు 49వ మండల పూజ నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శంకరయ్య శనివారం తెలిపారు. సోమ వారం తిరుమంజనం, ధ్వజారోహణ, మంగళవారం కన్నె పూజ, అన్న దాన కార్యక్రమం ఉంటాయన్నారు. బుధవారం గ్రామోత్సవం, అనంత రం అగ్నిగుండ ప్రవేశం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....