FESTIVAL: ఘనంగా రాఖీ పౌర్ణమి
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:20 AM
నియోజకవర్గంలోని అక్క, చెల్లెమ్మలకు సరైన ఉపాధి చూపించేందుకు తనతో పాటు ప్రభు త్వం కట్టుబడి ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో రక్షాబం ధన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పరిటాల శ్రీరామ్‌కు తెలుగు మహిళలు, పలు వర్గాలకు చెందిన మహిళలు పెద్తఎత్తున తరలివచ్చి రాఖీలు కట్టారు.
ధర్మవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని అక్క, చెల్లెమ్మలకు సరైన ఉపాధి చూపించేందుకు తనతో పాటు ప్రభు త్వం కట్టుబడి ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో రక్షాబం ధన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పరిటాల శ్రీరామ్‌కు తెలుగు మహిళలు, పలు వర్గాలకు చెందిన మహిళలు పెద్తఎత్తున తరలివచ్చి రాఖీలు కట్టారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... అన్నచెల్లళ్లు అనుబంధానికి ప్రతీకగా నిర్వహించే రాఖీపండుగ వేళ ఇంత మంది మహిళల అభిమానం చూడటం ఆనందంగా ఉందన్నారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న మహిళల కోసం గార్మెంట్స్ తరహా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశతో మాట్లాడామని తెలిపారు.