CELEBRATION: ఘనంగా గుర్రం జాషువా జయంతి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:13 AM
జిల్లాకేంద్రంలోని ఆర్వీజే కళ్యాణమండపంలో కవకోకిల గుర్రంజాషువా 130వ జయంతి వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు.
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని ఆర్వీజే కళ్యాణమండపంలో కవకోకిల గుర్రంజాషువా 130వ జయంతి వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కవి ఏలూరి ఎంగన్న, మాణిక్యం ఇషాక్, సమ్మెట మాధవ రాజు హాజరుకాగా వారిని బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరికృష్ణ, కత్తిరాజారెడ్డి, సురేంద్రబాబు, కళ్యాణ్‌కుమార్, సోకేరామాంజి నేయులు, బాలగంగాధర్, సునీల్ వైట్ల, దేవేంద్ర అమర తదితరులు పాల్గొన్నారు.