GOD: ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:26 PM
మండలకేంద్రంలో శనివా రం రాత్రి అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. బత్తలపల్లి లోని అయ్యప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరిం చిన హంస వాహనంలో అయ్యప్ప ఉత్సవమూర్తిని ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.
బత్తలపల్లి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో శనివా రం రాత్రి అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. బత్తలపల్లి లోని అయ్యప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరిం చిన హంస వాహనంలో అయ్యప్ప ఉత్సవమూర్తిని ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో బాలికలు జ్యోతులు పట్టగా, అయ్యప్ప మాలధారుల భజనతో గ్రామ వీధులు మార్మోగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామికి కొబ్బరి కాయలు కొట్టించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామోత్సవంలో అయ్యప్ప పాటలు పాడు తూ నృత్యం చేయడం అందరినీ అకట్టుకుంది. ఈ సందర్భంగా అయ్య ప్ప దేవాలయం వద్ద మాలధారులకు, భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి శెట్టప్పస్వామి, జక్కంపూటి సత్యనారాయణ, నాగభూషణ, పురు షోత్తంచౌదరి, రామంజినేయులు, ప్రతాప్, అప్పస్వామి, సంగాల సూరి, రాము, ఆది, బొజ్జప్ప, సిమెంటు శీన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....