GOD: వైభవంగా అయ్యప్ప గ్రామోత్సవం
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:03 AM
పట్టణంలోని కేశవనగర్‌లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్‌కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
ధర్మవరం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కేశవనగర్‌లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్‌కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామోత్సవం సందర్భంగా అయ్యప్ప భజనలు, పాటలతో పట్టణం మార్మోగింది. కేరళవా యిద్యాలతో భజనలు చేశారు. జ నసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి స్వామిని దర్శించుకుని ప్రత్యే కంగా పూజలు చేయించారు.