Share News

BUS STAND: శిథిలావస్థలో బస్టాండ్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:11 AM

మండలంలోని తమ్మల గ్రామంలో ప్రధాన రహ దారిలో ఉన్న బస్టాండ్‌ శిథిలావస్థకు చేరింది. బస్టాండ్‌ గోడలు పూర్తి గా ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన ప్ర యాణికులు ధర్మవరం వెళ్లాలంటే బస్టాండ్‌ వద్దకు వచ్చి ఆటోలకు వెళుతుంటారు. బస్టాండ్‌ పూర్తి ఆసౌకర్యంగా ఉండటంతో వారు ఆటోల కోసం ఎండలో నిలబడాల్సి వస్తోంది.

BUS STAND: శిథిలావస్థలో బస్టాండ్‌

ధర్మవరం రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి):మండలంలోని తమ్మల గ్రామంలో ప్రధాన రహ దారిలో ఉన్న బస్టాండ్‌ శిథిలావస్థకు చేరింది. బస్టాండ్‌ గోడలు పూర్తి గా ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన ప్ర యాణికులు ధర్మవరం వెళ్లాలంటే బస్టాండ్‌ వద్దకు వచ్చి ఆటోలకు వెళుతుంటారు. బస్టాండ్‌ పూర్తి ఆసౌకర్యంగా ఉండటంతో వారు ఆటోల కోసం ఎండలో నిలబడాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్‌ మరమ్మతులు చేపట్టి, ప్రయాణికులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:11 AM