EMPLOYEES: వేధిస్తున్న సిబ్బంది కొరత
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:17 AM
మండల వ్యాప్తంగా ఉన్న నాలుగు విద్యుత సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ సిబ్బంది అరకొరగా ఉన్నా అవేమీపట్టనట్టుగా ఉన్నతాధికారులు ఇక్కడి వారిని అదనపు బాధ్యతలు అప్పగించి ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో మండల ప్రజలు విద్యుత సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 4,800 వ్యవ సాయ విద్యుత కనెక్షనలు ఉన్నాయి.
విద్యుత సమస్యలతో
ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు
తాడిమర్రి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ఉన్న నాలుగు విద్యుత సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ సిబ్బంది అరకొరగా ఉన్నా అవేమీపట్టనట్టుగా ఉన్నతాధికారులు ఇక్కడి వారిని అదనపు బాధ్యతలు అప్పగించి ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో మండల ప్రజలు విద్యుత సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 4,800 వ్యవ సాయ విద్యుత కనెక్షనలు ఉన్నాయి. వాటిని వర్షాకాలంలో తప్పనిసరిగా జాగ్రత్తగా పరిశీ లించాల్సి ఉంటుంది. అలాగే పోల్స్ సరిచేయడం, లైన్లు బాగుచేయడం, జంగిల్ క్లియరెన్స, కొత్తవిద్యుత కనెక్షనలు ఇవ్వడం తదితర వాటితో పాటు ఎక్కడైనా విద్యుత సరఫరాలో సమస్య తలెత్తిన ప్పుడు సిబ్బంది వెంటనే వెళ్లి పరిష్కరించాల్సి ఉంటుంది.
మండలంలో పోల్ టు పోల్ సిబ్బంది, ఏఎల్‌ఎంలు, లైనమనలు, లైన ఇనస్పెక్టర్ల కొరతతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ స్థానం కూడా ఖాళీగా ఉంది. ఎనిమిది నెలలుగా విద్యుత శాఖ ఏఈని నియమించలేదు. బత్తలపల్లి మండలానికి చెందిన ఏఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ నలుగురు లైన ఇనస్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే లైనమనలు, అసిస్టెంట్ లైనమనలు కూడా పూర్తి స్థా యిలో లేరు. వారి బదులుగా పోల్ టు పోల్ సిబ్బంది అయిన సరిగా ఉన్నారు అనుకుంటే వారు కూడా ఆరుగురే ఉన్నారు. దీంతో వర్షాకాలంలో ఏర్పడే విద్యుత సమస్యలు పరిష్కరించేం దుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు బిల్లులు కట్టించే పని కూడా వారే చేయాల్సి వస్తోంది. రైతులు ఎవరైనా రెట్టించి అడిగితే తమ వద్ద తగిన సిబ్బంది లేరు... తాము ఏం చేయాలంటూ వారే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అదనపు సిబ్బందిని కేటాయించ డం తప్ప వేరే మార్గం లేదని మండల ప్రజలు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....