RDO: సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:10 AM
మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్‌కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.
ముదిగుబ్బ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్‌కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల ప్రజలు వివిధ సమస్యలపై 273 ఫిర్యాదులను అర్జీల రూపంలో ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో హిందువులకు శ్మశాన వాటికకు స్థలం కావాలని కోరారు. అదేవిధంగా 22ఏ నిషేధిత జాబితా తొలగిం చాలని, గత ప్రభుత్వంలో నకిలీ ఇంటిపట్టాలు సృష్టించి స్టేడియం స్థలా న్ని కబ్జా చేశారని తదితర ఫిర్యాదులను ఆర్డీవోకు అందజేశారు. ఆర్డీవో కు వచ్చిన ఫిర్యాదులు ఆర్.ఓ.ఆర్ 100, 22ఏ, 82, కొత్త అసైన మెంట్‌లకు 19, ల్యాండ్ కాంపో జిషన11, రస్తా సమస్యలు 29, ఎన క్రోస్‌మెంట్ 5, వాల్టా 2, సివిల్ సప్లైస్ 3, హౌస్‌సైట్స్ 9, పంచాయితీకి సంబంధించి 13 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ నాయకులు, రైతులు వాటిని అంద జేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... ముదిగుబ్బ మండల వ్యాప్తంగా చాలా భూ సమస్యలపై ఫిర్యాదులు అందాయని వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....