RECOVERY: రూ.1,37,637 అవినీతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:34 AM
స్థానిక ఎంపీడీఓ కార్యా లయం ఆవరణంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను ఎంపీడీఓ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీల వారీగా చేసిన పనులను, అందులో జరిగిన అవినీతిని సామాజిక తనిఖీ అధికారులు వెల్లడించారు.
నల్లమాడ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యా లయం ఆవరణంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను ఎంపీడీఓ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీల వారీగా చేసిన పనులను, అందులో జరిగిన అవినీతిని సామాజిక తనిఖీ అధికారులు వెల్లడించారు. కెకె.తండాలో రూ.5,628, వంకరకుంట రూ.6,901, వేళ్లమద్ది రూ.వెయ్యి, కురమాల రూ.2,401, రెడ్డిపల్లి రూ.7,631, నల్లమాడ రూ.23,610, పాతబత్తపల్లి రూ.4.358, ఎర్రవంకపల్లి రూ.3,382, చారుపల్లి రూ.16,326, గోపేపల్లి రూ.రెండువేలు, పికెపితండా రూ.వెయ్యి, దొన్నికోట రూ.40,693, పులగంపల్లి రూ.7,325, మసకవంకపల్లి రూ.15,382 అవినీతి జరిగినట్లు వెల్లడించారు. మొత్తం రూ.1,37,637 అవినీతి జరిగినట్లు తేల్గారు. ఈ సొమ్మును రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొసీడింగ్ అధికారి శివానందనాయక్, ఏవీఓ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఆర్‌పీ భాస్కర్, ఏపీడీ జ్యోతి, ఎపీఎఓలు రఘునాథ్‌రెడ్డి, సూర్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.