HOLE: ఆదమరిస్తే అంతే..!
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:54 PM
ప్రమాదాలు జరిగినా, అనారోగ్యాలకు గురైనా హడావుడిగా ఆసుప త్రికి వెళు తుంటాం. అయితే ధర్మవరం పెద్దాసుపత్రి ప్రవేశ ద్వారంలో ఎదుట అమర్చిన ఇనుప పైపుల వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అడుగుపెడితే జా రిపడి గుంతలోకి పడిపోయి... కాళ్లు, చేతులు విరిగే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి పోయే రోగులు వామ్మో ఏమి ఇలా ఉందని భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి ప్రవేశ ద్వారంలో ఇనుపపైపుల వద్ద గుంత
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాలు జరిగినా, అనారోగ్యాలకు గురైనా హడావుడిగా ఆసుప త్రికి వెళు తుంటాం. అయితే ధర్మవరం పెద్దాసుపత్రి ప్రవేశ ద్వారంలో ఎదుట అమర్చిన ఇనుప పైపుల వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అడుగుపెడితే జా రిపడి గుంతలోకి పడిపోయి... కాళ్లు, చేతులు విరిగే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి పోయే రోగులు వామ్మో ఏమి ఇలా ఉందని భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపా టుగా అడుగుపెడితే ఇనుప పైపులపై జారి పడుతారు. ముందుభాగం కాంక్రీట్ లేకపోవడంతో రోడ్డుకు, పైపులకు మధ్య కాలు ఇరుక్కునే ప్ర మాదం ఉందని హాడలెత్తిపోతున్నారు. దీంతో వృద్ధులు మధ్యలో వెళ్లకుండా పక్కన ఉన్న గేట్లను ప ట్టుకుని జాగ్రత్తగా వెళుతున్నారు. ఎదురుగా ఎవరైనా వస్తే, వారు వెళ్లే వరకు ఆగి ముందుకు వెళుతన్నారు.. ఆసుపత్రి అధికారులు స్పందిం చి ఆసుపత్రిలోకి వచ్చే దారిలో ఉన్న ఇనుప పైపుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....