Tagore Movie Hospital Scene : ఠాగూర్ సినిమా సీన్ రిపీట్: అనంతపురం ఆసుపత్రిలో శవానికి చికిత్స!
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:30 PM
'ఠాగూర్' సినిమాలోని హాస్పిటల్ సీన్ మరోసారి నిజజీవితంలో రిపీట్ అయింది. ధర్మవరంకు చెందిన పార్వతి అనే మహిళ ట్రీట్మెంట్ పేరిట ఈ ఘనకార్యం చేశారు సదరు ఆస్పత్రి డాక్టర్లు.
అనంతపురం, సెప్టెంబర్ 21: 'ఠాగూర్' సినిమాలోని హాస్పిటల్ సీన్ మరోసారి నిజ జీవితంలో రిపీట్ అయింది. ధర్మవరానికి చెందిన పార్వతి అనే మహిళకు ట్రీట్మెంట్ పేరిట ఈ ఘనకార్యం చేశారు సదరు ఆస్పత్రి డాక్టర్లు. ఊపిరితిత్తుల సమస్యతో రెండు రోజుల ముందు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పార్వతి.. చికిత్స సమయంలోనే మరణించారు. కానీ, డాక్టర్లు పార్వతి చనిపోయిన విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియకుండా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు నటించారు. భారీ ఫీజులు వసూలు చేసి, కుటుంబాన్ని మోసం చేశారు.
అయితే, సదరు భారీ బిల్లులు చెల్లించలేక మరో ఆసుపత్రికి తీసుకెళ్తామని ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రి సిబ్బందిని కోరినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి