Anantapur: ఆ జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:55 PM
జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురంలో -3, గుంతకల్లు-2, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయన్నారు.
అనంతపురం: జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురంలో -3, గుంతకల్లు-2, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం(Kalyanadurgam, Rayadurgam)లో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయన్నారు. 2025-28 నూతన బార్ పాలసీలో భాగంగా గతంలో లాటరీ నిర్వహించగా జిల్లాలో మిగిలిపోయిన ఈ 9 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. ఈనెల 14న సాయంత్రం 6 గంటల వరకూ ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చున న్నారు. 15న ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ తీస్తామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News