Share News

కస్టమర్లకు పలు అవకాశాలు ఇస్తున్నాం: అమెజాన్‌

ABN , Publish Date - Jan 29 , 2025 | 06:20 AM

గడువు తీరిన గిఫ్ట్‌ కార్డుల్లో డబ్బు అదృశ్యం అవుతోందంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెజాన్‌ స్పందించింది.

కస్టమర్లకు పలు అవకాశాలు ఇస్తున్నాం: అమెజాన్‌

అమరావతి, జనవరి 28: గడువు తీరిన గిఫ్ట్‌ కార్డుల్లో డబ్బు అదృశ్యం అవుతోందంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెజాన్‌ స్పందించింది. వినియోగించని కార్డుల్లోని డబ్బును వెనక్కి తీసుకోవడానికి తమ కస్టమర్లకు పలు అవకాశాలు ఇస్తున్నామం టూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్డుల విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు పాటిస్తున్నామని తెలిపింది. గిఫ్ట్‌ కార్డు కొన్న వారికి గడువు తీరేలోగా రెండు సార్లు రిమైండర్లు పంపుతామని వెల్లడించింది. కాగా, గిఫ్ట్‌ కార్డుల్లో డబ్బు మాయంపై పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఎక్స్‌ వేదికగా స్పందించారు. కస్టమర్లు కస్టపడి సంపాదించిన డబ్బు అదృశ్యం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 06:20 AM