Minister Narayana: గ్రాఫిక్స్ అనేవారుఇక్కడకు రండి
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:17 AM
వచ్చే మార్చి నెలాఖరు నాటికి అమరావతిలోని అధికారులు, ఉద్యోగుల భవనాలను సిద్ధం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ‘‘అసలు అమరావతిలో...
అమరావతిపై దుష్ప్రచారం తగదు.. వారిని ప్రజలు క్షమించరు
మార్చినెలాఖరు కల్లా అధికారులు, ఉద్యోగుల భవనాలు పూర్తి
మూడేళ్లలో రాజధాని సిద్ధం: నారాయణ
గుంటూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వచ్చే మార్చి నెలాఖరు నాటికి అమరావతిలోని అధికారులు, ఉద్యోగుల భవనాలను సిద్ధం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ‘‘అసలు అమరావతిలో పనులేమీ జరగడం లేదని, గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరు. వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలి.’’ అని ఆయ న సవాలు విసిరారు. రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్-1, టైప్ -2 భవనాలతో పాటు గ్రూప్-డి ఉద్యోగుల భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి...ఎప్పటికల్లా పూర్తవుతాయి... భవనాలతోపాటు ఇతర మౌళిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సీఆర్డీయే ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే, కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతిలో ప్రస్తుతం 13 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనులు చేస్తున్నారు. సుమారు 2500 వరకూ ప్రొక్లెయిన్‌లు, జేసీబీలు, ఇతర యంత్రాలు పని చేస్తున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్-1 భవనాల్లో 4 టవర్లలోని 384 ఫ్లాట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. టైప్ -2 భవనాల్లో మరో 4 టవర్లలో 336 ఫ్లాట్లు, గ్రూప్-డి ఉద్యోగుల కొరకు మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 1,440 ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేేసలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. వీటిలో 50 శాతం ఇళ్లు అక్టోబరు రెండు నాటికి పూర్తవుతాయి.’’ అని నారాయణ వివరించారు.


అమరావతి ేసఫ్..
అమరావతిలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల మేర లే అవుట్ రోడ్లు, 4వేల నివాస భవనాలు, ఐకానిక్ భవనాల పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి చాలా ేసఫ్ సిటీ అని మంత్రి తేల్చిచెప్పారు. అమరావతిలో వరద నివారణ కోసం నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామని చెప్పారు. అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని, మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News