Papaya: ఒరినీ.. ఇదెక్కడి మాయ.. బొప్పాయి ఇలా కాసిందేంటి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:33 PM
బొప్పాయి పండ్లందు ఈ బొప్పాయి వేరయా అనాల్సిందే. ఎందుకంటే.. సాధారణ బొప్పాయి పండ్ల మాదిరిగా కాకుండా.. ఈ చెట్టుకు విభిన్నంగా కాస్తున్నాయి. వాటిని చూసి జనాలు అవాక్కవుతున్నారు..

ఆంధ్రప్రదేశ్, జనవరి 17: బొప్పాయి చెట్టు ఎలా ఉంటుంది.. దానికి కాయలు ఎలా కాస్తాయి.. అని అడిగితే చెట్టు ఇలా ఉంటుంది, ఆ చెట్టుకు బొప్పాయి కాయలు ఇలా కాస్తాయని టక్కున సమాధానం చెబుతారు. కానీ, ఇప్పటి వరకు మీరు చూసిన బొప్పాయి చెట్లు, కాయల గురించే ఇక్కడ సమాధానం చెబితే.. పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. మీరు చెప్పే సమాధానం పూర్తిగా తప్పు అవుతుంది మరి. అదేంటి? అలాగెలా అవుతుందని ఆలోచిస్తున్నారా? మరి ఇక్కడ బొప్పాయి చెట్టు, దానికి కాసే కాయలు.. మిగతా చెట్ల మాదిరిగా లేవండీ. తీగ చెట్టు మాదిరిగా కాయలు కాస్తోంది. అవును, మీరు చదివింది అక్షరాలా నిజం. ఈ చెట్టుకు కాయలు.. తీగ మాదిరిగా వేలాడుతూ కాస్తున్నాయి. మరి ఈ వింత బొప్పాయి చెట్టు ఎక్కడుంది? అసలు ఎలా ఇలా కాయలు కాస్తోంది? పూర్తి వివరాలను కింద తెలుసుకుందాం..
సాధారణంగా బొప్పాయి చెట్ల ప్రధాన కాండానికి కాయలు అతుక్కొని ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం విచిత్రంగా బొప్పాయి పండ్లు కాస్తున్నాయి. జీకేవీధి పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన భీమరాజు తన ఇంటి పెరట్లో బొప్పాయి చెట్టు నాటాడు. ఈ చెట్టు తీగలకు వేలాడుతూ కాయలు కాశాయి. సహజానికి భిన్నంగా ఈ బొప్పాయి పండ్లు ఉండటంతో స్థానిక ప్రజలు షాక్ అవుతున్నారు. భీమరాజు మూడేళ్ల క్రితం సంతకు వెళ్లినప్పుడు ఈ బొప్పాయి మొక్కను కొనుగోలు చేశాడట. తన ఇంటి పెరట్లో నాటాడు. తాజాగా ఆ బొప్పాయి చెట్టుకు కాపు వచ్చింది. తీగల మాదిరిగా బొప్పాయి కాయలు కాశాయి. బొప్పాయి కాయలు వేలాడుతూ ఉండటంతో గమనించి స్థానికులు షాక్ అయ్యారు. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.
Also Read:
15 రోజుల పాటు సంక్రాంతి పండుగ.. ఎక్కడో తెలుసా..
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనానికి డేట్ ఫిక్స్
ఏఐతో ఇలా కూడా చేస్తారా.. ఏకంగా దేశ ప్రధానినే
For More Andhra Pradesh News and Telugu News..