Share News

కళా ఉద్యమాలను నిర్మిస్తాం: ఏఐపీఎల్‌సీఎఫ్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:31 AM

గుంటూరు లో 3 రోజులుగా జరిగిన అఖిల భారత ప్రజాసాహిత్య సాంస్కృతిక సభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా...

కళా ఉద్యమాలను నిర్మిస్తాం: ఏఐపీఎల్‌సీఎఫ్‌

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సామ్రాజ్యవాద, ప్రపంచీకరణలకు వ్యతిరేకంగా జాతీయ వాద సాహిత్య, సాంస్కృతిక, కళా ఉద్యమాలను నిర్మిస్తామని అఖిలభారత సాహిత్య సాంస్కృతిక కళా రంగ(ఏఐపీఎల్‌సీఎఫ్‌) సభలో వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు లో 3 రోజులుగా జరిగిన అఖిల భారత ప్రజాసాహిత్య సాంస్కృతిక సభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలను కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికన చీలుస్తూ అభివృద్ధి నాగరికత పేరుతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్న పాలకపార్టీ ల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐపీఎల్‌సీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవిబాబు, ఉపాధ్యక్షుడు దివి కుమార్‌, కోశాధికారి భట్టు రమణ ప్రసాద్‌, జన సాహితీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి. అరుణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

సభలో ఏఐపీఎల్‌సీఎఫ్‌ జాతీయ కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కే. రవిబాబు(ఆంధ్రప్రదేశ్‌), అధ్యక్షుడుగా గౌతమ్‌ ముఖర్జీ(పశ్చిమబెంగాల్‌), ఉపాధ్యక్షుడుగా దివికుమార్‌(ఏపీ), కోశాధికారిగా రమణప్రసాద్‌ (తెలంగాణ), సభ్యులుగా భట్టు లక్మీనారాయణ, భూపాల్‌ (తెలంగాణ). సియా సరణ్‌శర్మ, సుజయ్‌రాయ్‌, ప్రజాపతి(జార్ఖండ్‌), బసుదేవ్‌దాస్‌, భవాని(ఒరిస్సా) పట్రలేఖ, అజ్ఞాన్లల్‌ అన్సారి(బీహార్‌), షిండే(మహారాష్ట్ర), సుగధన్‌పాల్‌(కేరళ), అరుణ(ఏపి)ను ఎన్నుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 05:40 AM