Share News

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:51 AM

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది.

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

  • నాలుగు క్యాంప్‌సలలో కౌన్సెలింగ్‌ నిర్వహణ

నూజివీడు/వేంపల్లె, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. నూజివీడు, ఇడుపులపాయ క్యాంప్‌సలకు ఎంపికైన విద్యార్థులకు ఆయా క్యాంప్‌సలోనే కౌన్సెలింగ్‌ మొదలైంది.


ఉదయం 8 గంటల నుంచి ఏలూరు జిల్లా నూజివీడు ఆర్జీయుకేటీ శాక్‌ ఆడిటోరియంలో మొదటి రోజు నూజివీడు క్యాంప్‌సకు సంబంధించి 505 మంది విద్యార్ధులకు కాల్‌ లెటర్లు పంపించగా 437 మంది అడ్మిషన్లు పొందారని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ తెలిపారు. బాలురు 126 మంది, బాలికలు 311 మంది అడ్మిషన్లు పొందినట్టు చెప్పారు. కాగా.. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 1,060 మంది చేరాల్సి ఉండగా మొదటి విడతగా 538 మందికి కాల్‌ లెటర్లు పంపించారు. వారిలో సోమవారం 481 మంది చేరారు.

Updated Date - Jul 01 , 2025 | 06:43 AM