Vijayawada: ఖాళీ ప్లాట్లలో ట్యాంకర్లతో యాసిడ్ డంప్.. రంగంలోకి పోలీసులు
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:03 PM
ఓ చోట ఖాళీ ప్లాట్లలో ట్యాంకర్లతో యాసిడ్ డంప్ చేస్తున్నారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ప్లాట్ ఓనర్లు ఆ ప్రాంతానికి చేరుకుని డంప్ చేస్తున్న డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

విజయవాడ(Vijayawada)లోని జక్కంపూడి పరిధిలో 132 ఎకరాల ఖాళీ ప్లాట్లలో యాసిడ్ డంప్ చేయంపై అక్కడి ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఓ ట్యాంకర్ డ్రైవర్‌ను పట్టుకుని అక్కడి ప్లాట్ ఓనర్లు పోలీసులకు అప్పగించారు. వైజాగ్ నుంచి యాసిడ్ తీసుకుని ట్యాంకర్లలో తరలించి, అక్కడి ప్లాట్లలోని మట్టిలో ప్రమాదకరమైన రసాయనాలు వేస్తున్నారని ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఈ కేసులో క్రెబ్స్ బయోకెమికల్స్ అనే కంపెనీ పేరుతో ట్యాంకర్లలో యాసిడ్ తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో తమ ప్లాట్లలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను చూసిన ప్లాట్ ఓనర్లు వాటిని అడ్డుకున్నారు.
కెమికల్ డంపింగ్..
ప్రముఖ రసాయన సంస్థ క్రెబ్స్ బయోకెమికల్స్ నుంచి వచ్చిన ఈ ట్యాంకర్లు, వైజాగ్ నుంచి ఔషధ రూపంలో ఉండే హానికరమైన యాసిడ్‌ను తీసుకెళ్లి, జక్కంపూడి ప్రాంతంలోని కొన్ని ఖాళీ ప్లాట్లలో పూడ్చే యత్నం చేశారని ఓనర్లు చెబుతున్నారు. ఈ డంపింగ్ వల్ల ఆ ప్రాంతంలోని గాలితోపాటు నీరు కూడా విషపూరితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓనర్లు ఏం చెబుతున్నారంటే..
మా భూముల్లో జరిగే ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను అనుమతించేదిలేదని ఓ ప్లాట్ ఓనర్ అన్నారు. ఇలా చేస్తే ఆ ప్రాంత పరిసరాలపై పెద్ద ప్రమాదం పడుతుందని భయపడి, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరికొంత మంది మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి రసాయనాలను డంప్ చేసే వారి విషయంలో నిఘా ఉంచాలని కోరుతున్నారు. ఇలా చేసే వారిని మేము చుడకుండా ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు ఏమన్నారంటే...
కొత్తపేట పోలీసులు ఈ అంశంపై వెంటనే స్పందించి ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆ ట్యాంకర్‌ను పరిశీలించారు. విచారణలో యాసిడ్ రవాణా చేసే కంపెనీ క్రెబ్స్ బయోకెమికల్స్ మీద మరింత సమాచారం సేకరించి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంబంధిత అన్ని వివరాలను సమీక్షిస్తామన్నారు. అందరినీ సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, యాసిడ్ డంపింగ్ కారణంగా ఏవైనా హానికరమైన పరిణామాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Election notification: గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
Read Latest AP News And Telugu News