ACB : ‘విత్తన ధ్రువీకరణ’ ఉన్నతాధికారులపై ఏసీబీకి ఫిర్యాదు
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:01 AM
‘విత్తన క్షేత్రాలు, విత్తన నాణ్యత, విత్తన, పరిశోధన ఫలితాల విషయంలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు...

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా లాంలోని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అథారిటీలోని ఇద్దరు ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదులు వెళ్లాయి. వీరు ఆదాయాన్ని మించి భారీగా ఆస్తులు కూడగట్టారని పలువురు ఏసీబీకి లేఖ రాసినట్లు తెలిసింది. విత్తన ధ్రువీకరణ అధికారులుగా పనిచేస్తున్న ముగ్గురికి పదోన్నతులు కల్పించినందుకు రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నారని సమాచారం. ‘విత్తన క్షేత్రాలు, విత్తన నాణ్యత, విత్తన, పరిశోధన ఫలితాల విషయంలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, కొత్త సిబ్బంది నియామకాల్లో ముడుపులు తీసుకుంటున్నారు. వాహనాల కొనుగోలు, కార్యాలయ నిర్వహణ వ్యయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనిపై కౌంటర్ వేయకుండా, ముడుపులు పుచ్చుకుని, కొనసాగిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 25మందిలో ఐదుగురిని పర్మినెంట్ చేసే ప్రయత్నాలు చేయగా, బోర్డు మీటింగ్‌లో బెడిసికొట్టింది. సంస్థ వాహనాన్ని హైదరాబాద్‌లో కీలక అధికారి కుటుంబ సభ్యులు వాడుతుంటే, ఏపీలో ఉపయోగిస్తున్నట్లు లాగ్‌బుక్‌లో రాస్తున్నారు. మరో ఉన్నతాధికారి తాత్కాలిక ఉద్యోగిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి, ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమాలకు పాల్పడుతున్నారు’ అని ఏసీబీ డైరెక్టర్‌తోపాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట