Share News

ABVP : స్టార్టప్‌లను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jan 25 , 2025 | 06:32 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి....

ABVP : స్టార్టప్‌లను ప్రోత్సహించాలి

  • ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోలంకి పిలుపు

మద్దిలపాలెం(విశాఖపట్నం), జనవరి 24(ఆంధ్రజ్యోతి): యువతలో స్వావలంబనను పెంపొందించడానికి స్టార్ట్‌పలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్రసింగ్‌ సోలంకి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారతదేశ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలు, సాంస్కృతిక విలువలను సంరక్షించడం నేడు చాలా అవసరమని తెలిపారు. సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో యువత ప్రముఖ పాత్ర పోషించాలని, సమృద్ధ భారత్‌, వికసిత భారత్‌, విశ్వగురువుగా భారత్‌ను తీర్చిదిద్దడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సోలంకి పిలుపునిచ్చారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్రకార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా వెంకట గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు, కాంటినెంటల్‌ కాఫీ సంస్థ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్‌, మహాసభల స్వాగత కమిటీ అధ్యక్షుడు కలిదిండి రఘు, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 06:32 AM