IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN , Publish Date - Jan 20 , 2025 | 10:16 PM
IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొద్ది సేపటికే.. 25 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.
అమరావతి, జనవరి 20: రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపి స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్‌ను సిఎం ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీ డిజిగ్నేట్ చేస్తున్నట్లు.. జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హౌసింగ్ డిపార్టమెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ అజయ్ జైన్‌కు టూరిజం అండ్ కల్చరల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఎక్స్అఫీసియో చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌కి.. పశు సంవర్ధక, డైరీ, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కె సునీతను పబ్లిక్ ఎంట్రర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వాణీ మోహన్‌కు ఆర్కియాలజీ, మ్యూజియం కమీషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
పీయూష్ కుమార్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగిస్తూ.. ప్లానింగ్ డిపార్టమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ముఖేష్ కుమార్ మీనాను జీఏడీ పోలిటికల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వుల్లో వివరించింది.
ఎస్ సురేష్ కుమార్‌ను ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. సౌరబ్ గౌర్‌ను సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నియమించారు. కొన శశిధర్‌ను ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగించారు. కాటమనేని భాస్కర్‌ను ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు. వీటితోపాటు ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయాలు కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వి. కరుణను సెర్ప్ సిఇవోగా బదిలీ చేశారు. ఎన్ యువరాజ్‌కు ఐ అండ్ ఐ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎంఎం నాయక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.
Also Read: మౌని అమావాస్య రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?
Also Read: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు
ప్రవీణ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. కన్నబాబును సిఆర్డీఏ కమీషనర్‌గా నియమించారు. ఎంవి శేషగిరిబాబును కమిషనర్ లేబర్ డిపార్టమెంట్‌కు బదిలీ చేశారు. ఎస్ సత్యనారాయణను బిసి వెల్పేర్, ఈడబ్ల్యూఎస్ సెక్రటరీగా నియమించారు. వాడ్రేవు వినయ్‌చంద్‌ను రివెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.
Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
జి వీరపాండ్యన్‌ను వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా పంపించారు. హరినారాయణ్‌ను ఐజి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌కు బదిలీ చేశారు. పీఎస్ గిరీషాను ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండిగా బదిలీ చేశారు. పి సంపత్ కుమార్‌ను సిడిఎంఏగా బదిలీ చేశారు. వి అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం..
Also Read: నాగ సాధువులు.. రహస్యాలు
Also Read: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం
For AndhraPradesh News And Telugu News