YS Jagan: అదానీ కేసులో ఇరుక్కొన్న జగన్: గోనె ప్రకాశ్ రావు
ABN , First Publish Date - 2024-11-25T13:41:34+05:30 IST
అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తెలిపారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశం లేదన్నారు.
అదానీ ఇష్యూలో వైఎస్ జగన్ ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కేసు నుంచి జగన్ బయట పడటం కష్టం అని స్పష్టం చేశారు. ముడుపుల కేసులో జగన్, అదానీ ఇద్దరు అరెస్ట్ అవుతారని వివరించారు. వారిద్దరీ అరెస్ట్‌ను ప్రధాని మోదీ కూడా అడ్డుకోలేరని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పవర్ ప్రాజెక్ట్ కోసం అదానీ సంస్థ జగన్ ప్రభుత్వానికి ముడుపులు అందజేసిందని అమెరికా ఆరోపించింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముడుపుల వ్యవహారం అగ్గిరాజేసింది.