Telugu State CMs: తెలుగు రాష్ట్రాల సీఎంలకు అఘోరి సవాల్
ABN , First Publish Date - 2024-11-06T18:46:09+05:30 IST
తెలంగాణలో మాయమై ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమయ్యారు అఘోరి. రాష్ట్రంలో వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. పనిలో పనిగా రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మహిళ అఘోరి సంచరిస్తున్నారు. అఘోరి రావడంతో ఆలయాల వద్దకు భారీగా జనం వస్తున్నారు. కోనసీమ జిల్లా ద్రాక్షారమంలో గల భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని అఘోరి దర్శించుకున్నారు. హిందు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఆలయానికి వెళ్తున్నానని ఆమె ప్రకటించారు. గో వధ, చిన్నారులపై లైంగికదాడులు అరికట్టాలని కోరారు. తనను ఆపాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. లేదంటే మీ సీట్లకు ముప్పు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు.