అనకాపల్లి జిల్లా: గిరిజనుల డోలీ కష్టాలు..

ABN, Publish Date - Dec 27 , 2024 | 01:46 PM

ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మహిళ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో వర్షంలో అతి కష్టంమీద మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మహిళ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో వర్షంలో అతి కష్టంమీద మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితో డోలీ కష్టాల నుంచి గట్టెక్కించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భిణీలతోపాటు వృద్ధులు, చిన్నారులకు అనారోగ్య సమస్యలు ఎదుురైతే డోలీ తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభమై.. మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను కొనసాగించి పూర్తి చేయాలని గిరిజనులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు కీలక ప్రకటన..

ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్ జెండర్స్..

ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం..

రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుబోయే విషయాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 27 , 2024 | 01:48 PM