ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్ జెండర్స్..

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:45 AM

ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ట్రాన్స్ జెండర్స్‌ హైదరాబాద్‌లో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. పాతబస్తీ, సంతోష్ ‌నగర్‌లో ఇద్దరు, మలక్‌పేట్ పరిధిలో ఒకరు.. ఇలా నగరం వ్యాప్తంగా ట్రైనింగ్ పూర్తి అయిన ట్రాన్స్ జెండర్లకు విధులు కేటాయించారు.

హైదరాబాద్: ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్స్ ట్రాఫిక్ విధుల్లో చేరారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని కానిస్టేబుళ్లకు ఇద్దరు చొప్పున కేటాయించారు. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవడంతో ట్రాన్స్ జెండర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు.


ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది హైదరాబాద్‌లో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. పాతబస్తీ, సంతోష్ ‌నగర్‌లో ఇద్దరు, మలక్‌పేట్ పరిధిలో ఒకరు.. ఇలా నగరం వ్యాప్తంగా ట్రైనింగ్ పూర్తి అయిన ట్రాన్స్ జెండర్లకు విధులు కేటాయించారు. ట్రాఫిక్ డ్యూటీలో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 27 , 2024 | 11:45 AM