అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: షర్మిల

ABN, Publish Date - Nov 22 , 2024 | 01:11 PM

సినీ నటుడు ప్రభాస్ ఎవరో తనకు తెలియదని.. అతనికి.. తనకు సంబంధం ఉన్నట్లు జగన్ తన సైతాను సైన్యంతో ప్రచారం చేసారని.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చెల్లెలపై నిజంగా ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని అప్పడు ఏం చేశారని... గాడితలు కాసారా.. అంటూ షర్మిల ప్రశ్నించారు.

హైదరాబాద్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు ప్రభాస్‌తో తనకు ఎలాంటి సబంధంలేదని, అసలు అతను ఎవరో తనకు తెలియదని ఆమె అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అప్పుడు తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పానని.. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారని.. తనకు ప్రభాస్‌తో ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేశారు.


బాలకృష్ణ భవనం నుంచి షర్మిలపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టానని జగన్మోహన్ రెడ్డి ఒక వీడియ క్లిప్‌ను చూపించారని.. చాలా సంతోషమని షర్మిల అన్నారు. అయితే జగన్‌కు నిజంగా చెల్లెలమీద ప్రేమ ఉంటే.. తన సైతాను సైన్యంతో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేసారని.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావని.. ఏం చేశావని, అప్పుడెందుకు బాలకృష్ణపై కేసు వేయలేదని ఆమె ప్రశ్నించారు. గాడిదలు కసావా.. చెల్లెలు మీద ఇలాంటి ప్రచారం సాగితే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తన వీడియోనే ప్లే చేసి జగన్ తన మైలేజ్ కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. చెల్లెను వాడేసుకుంటారని, అమ్మ మీద కేసు పెడతారని.. నాన్న పేరు సిబిఐలో పెడతారని.. జగన్ ఏమైనా చేయగల సమర్థుడంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర: కేటీఆర్

పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్‌

ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 22 , 2024 | 01:11 PM