విశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్..

ABN, Publish Date - Sep 09 , 2024 | 01:03 PM

విశాఖ: నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ వర్షం కురిసే అవకాశముంది.

విశాఖ: నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ వర్షం కురిసే అవకాశముంది. ఆదివారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. 80 పునరావాస కేంద్రాలను విశాఖ జీవీఎంసీ ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అధికారులు సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.


కాగా భారీ వర్షాలు అల్లూరి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అలాగే అరకు ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అరకుకు పర్యాటకులు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది..

బ్యారేజీపై కుట్రలో వెలుగు చూసిన మరో కోణం..

కోలుకోలేని స్థితిలో ఖమ్మం వాసులు

కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 09 , 2024 | 01:03 PM