సోషల్ మీడియా కేసులో పోలీసుల దూకుడు
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:58 AM
Andhrapradesh: వైసీపీ సోషల్ మీడియా కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ప్రశ్నించింది. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు.
కడప, డిసెంబర్ 30: సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ప్రశ్నించింది. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు విచారించారు.
వైసీపీ సోషల్ మీడియా కేసులకు సంబంధించి పులివెందుల పోలీసులు దూకుడు పెంచారు. రాయలసీమతో పాటు నెల్లూరు, హైదరాబాద్, విజయవాడకు చెందిన మొత్తం 70మందిపై కేసు నమోదు చేశారు. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఆయనను విచారించిన పోలీసులు.. అతడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. వర్రాతో పాటు 70 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వీరిలో కొంత మందిని పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ బృందం గాలిస్తోంది. ఈ 70 మందికి కూడా పోలీసులు 41ఏ నోటీసులను జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారిలో ఇప్పటి వరకు 15 మందిని మాత్రమే విచారించారు. మిగిలిన 55 మందిని కూడా పోలీసులు విచారించనున్నారు.
ఇవి కూడా చదవండి...
మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా
కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే
Read Latest AP News And Telugu News
Updated at - Dec 30 , 2024 | 11:58 AM