TG News: నాగర్ కర్నూల్ జిల్లాలో రమణీయ దృశ్యాలు కనువిందు..

ABN, Publish Date - May 25 , 2024 | 08:47 PM

ప్రకృతి అందాలకు నెలవైన కృష్ణానది అడవి పూల చీరకట్టి అందంగా కనిపిస్తోంది. సహజ సిద్ధంగా పెరిగే అడవి పూల ఆవాల మొక్కలు ఊదారంగు పూలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పూల తోటలను చూసి ప్రకృతి ప్రేమికులు తెగ సంబర పడిపోతున్నారు.

నాగర్ కర్నూల్: ప్రకృతి అందాలకు నెలవైన కృష్ణానది అడవి పూల చీరకట్టి అందంగా కనిపిస్తోంది. సహజ సిద్ధంగా పెరిగే అడవి పూల ఆవాల మొక్కలు ఊదారంగు పూలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పూల తోటలను చూసి ప్రకృతి ప్రేమికులు తెగ సంబర పడిపోతున్నారు. అందంగా కనిపిస్తున్న పూలు ఏ రైతు తోటలోనివి అనుకుంటే పొరపాటే. ఇవి కృష్ణానదిలో సహజ సిద్ధంగా పెరిగిన అడవి పూల ఆవాల మొక్కలు. నదిలోని లంకా భూముల్లో పెరిగిన ఈ మొక్కల పూలు పూసి అందంగా కనిపిస్తున్నాయి.


వంకాయ రంగులో పెట్టని తోటలా రమణీయంగా కనిపిస్తున్నాయి.దీంతో ఫొటోలు దిగేందుకు ప్రకృతి ప్రేమికులు ఉత్సాహం చూపిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణానదిలో పెంచని తోటలా కనిపిస్తున్న ఈ మొక్కల శాస్త్రీయ నామం ‘‘క్లియోమ్ చెల్లిడోని’’. ఈ మొక్కలను దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యలు డాక్టర్ సదాశివయ్య తెలిపారు. తలనొప్పి, చెవిపోటు, కీళ్లవాతంతో పాటు డయేరియా లాంటి వ్యాధులకు ఈ మొక్కలను ఉపయోగిస్తారని ఆయన చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి.

Updated at - Jun 03 , 2024 | 07:45 PM