ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ ఓవర్ యాక్షన్

ABN, Publish Date - Apr 15 , 2024 | 10:57 AM

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హల్ చల్ చేశారు. సీఎం జగన్‌పై గులకరాయితో హత్యయత్నం జరిగిందంటూ హంగామా సృష్టించారు.

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హల్ చల్ చేశారు. సీఎం జగన్‌పై గులకరాయితో హత్యయత్నం జరిగిందంటూ హంగామా సృష్టించారు. అనుచరులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎన్నికల అధికారులకు సవాల్ విసురుతున్నారు. అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై జిల్లాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మేకపాటిపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. అయినా మేకపాటి తన తీరును మార్చుకోవడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 15 , 2024 | 11:01 AM