గొడవలపై మంచు విష్ణు ఫస్ట్ రియాక్షన్..
ABN, Publish Date - Dec 10 , 2024 | 02:00 PM
తమ ఇంట్లో చిన్న తగాదా జరుగుతోందని దాన్ని పరిష్కరించుకుంటామని మంచు విష్ణు చెప్పారు. కాగా ఫ్యామిలీ గొడవల వార్తలతో విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జల్‌పల్లి నివాసానికి వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు ఒకే కారులో ఇంటికి వెళ్లారు.
హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవలపై మంచు విష్ణు స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనన్నారు. తమ ఇంట్లో చిన్న తగాదా జరుగుతోందని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. కాగా ఫ్యామిలీ గొడవల వార్తలతో విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జల్‌పల్లి నివాసానికి వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు ఒకే కారులో ఇంటికి వెళ్లారు.
ఇక మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్.. అతని భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మోహన్ బాబు, అతని 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. రెండు రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ కళ్యాణ్‍కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి
Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..
తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 10 , 2024 | 02:00 PM