మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:29 PM

మంచు కుటుంబంలో వివాదం చినికి.. చినికి గాలివానగా మారుతోంది. ఈ క్రమంలో మనోజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్యా, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం కొనసాగిస్తున్నానని అన్నారు. ఆస్తికోసం, డబ్బు కోసం తాను పోరాటం చేయలేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్: మంచు కుటుంబంలో వివాదం చినికి.. చినికి గాలివానగా మారుతోంది. మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మనోజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్యా, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం కొనసాగిస్తున్నానని అన్నారు. ఆస్తికోసం, డబ్బు కోసం తాను పోరాటం చేయలేదన్నారు. ఈ ఘటనలకు సంబంధించి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తన వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తానన్నారు.


కాగా మంచు మనోజ్‌పై జరిగిన దాడికి సంబంధించి ఇంట్లో సిసి పూటేజ్‌లు మాయమయ్యాయి. వినయ్ అనే వ్యక్తి మాయం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కూడా సిసి పుటేజ్‌లకు సంబంధించి ఆరా తీస్తున్నారు. దాడి జరిగినప్పుడు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనే దురుద్దేశంతోనే సిసి పూటేజ్‌లు మాయం చేశారని మనోజ్, అతని భార్య మౌనిక అంటున్నారు. కాగా ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మొదటిది మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేశారు. రెండోది మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని మనోజ్ అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థల్లోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్‍ కళ్యాణ్‍కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు

డ్రైవర్‌తో భార్గవ్‌ దొంగ అరెస్టు డ్రామా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 10 , 2024 | 01:29 PM