రిటైనింగ్ వాల్ ఉన్నా వరద ఎలా వచ్చింది..

ABN, Publish Date - Sep 03 , 2024 | 07:26 AM

విజయవాడ: నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఒకవైపు బుడమేరు కట్టతెగి సింగ్‌నగర్ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపానికి రామలింగశ్వర నగరం మొత్తం జలమయమైంది. ఊరు, వాడ, ఏరు, సెలయేరు అనే తేడా లేకుండా వరదలో కలిసిపోయింది.

విజయవాడ: నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఒకవైపు బుడమేరు కట్టతెగి సింగ్‌నగర్ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపానికి రామలింగశ్వర నగరం మొత్తం జలమయమైంది. ఊరు, వాడ, ఏరు, సెలయేరు అనే తేడా లేకుండా వరదలో కలిసిపోయింది. రిటైనింగ్ వాల్ ఉందనే ధైర్యంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వరద బాధితులుగా మారిపోయారు. ముంపులో చిక్కుకున్నవారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రిటైనింగ్ వాల్ ఉన్నా వరద ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది.


ప్రకాశం బ్యారేజ్‌కు ఎప్పుడు వరదలు వచ్చినా విజయవాడలోని కృష్ణలంక ప్రాంతాలు ముంపుకు గురౌతుండేవి. దీంతో వేలాదిమంది నిరశ్రులయి పునరావాసకేంద్రాలకు పరుగులు పెట్టేవారు. 2009లో రికార్డు స్థాయిలో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందికి వచ్చింది. అప్పుడు దిగువనున్న రాణిగారితోట, బాలాజీనగర్, గీతానగర్, రామలింగేశ్వరనగర్, ఎనమలకుదురు కట్ట వరకు వరద ముంపుకు గురౌతుండేవి. దీంతో సీఎం చంద్రబాబు 2018లో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు వరద వచ్చినా రాణిగారి తోట నుంచి ఎనమలకుదురు కట్ట వరకు ఉన్న ఇళ్లు ముంపుబారిన పడకుండా ప్రజలు సురక్షితంగా ఉండేవారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కష్టకాలం

481 రైళ్లు రద్దు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 03 , 2024 | 07:44 AM