పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

ABN, Publish Date - May 29 , 2024 | 09:52 AM

పల్నాడు జిల్లా: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. జూన్‌ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలూ వద్దని పోలీసులను ఆదేశించింది.

పల్నాడు జిల్లా: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. జూన్‌ 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలూ వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్‌పోర్టును గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో అప్పగించాలని.. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న, ఉపయోగంలో ఉన్న మొబైల్‌ నంబర్‌తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 29 , 2024 | 09:52 AM