నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..
ABN, Publish Date - Oct 01 , 2024 | 12:05 PM
మంగళవారం తెల్లవారు జామున నటుడు గోవింద లైసెన్స్‌డు గన్ శుభ్రం చేస్తు్న్న క్రమంలో లాక్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా గన్ పేలింది. బుల్లెట్ ఆయన కాలిలోకి చొచ్చుకుపోయింది. వెంటనే ఆయన కుటుంబసభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు.
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం అయ్యింది. ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో గోవింద కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నటుడు గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మంగళవారం తెల్లవారు జామున నటుడు గోవింద లైసెన్స్‌డు గన్ శుభ్రం చేస్తున్న క్రమంలో లాక్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా గన్ పేలింది. బుల్లెట్ ఆయన కాలిలోకి చొచ్చుకుపోయింది. వెంటనే ఆయన కుటుంబసభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గన్ సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు
విజయవాడలో 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 01 , 2024 | 12:05 PM