NDA Leaders Meeting: ఎన్డీయే నేతల భేటీ..!! చంద్రబాబుకు కీలక భాద్యతలు..?

ABN, Publish Date - Jun 05 , 2024 | 05:51 PM

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీలోని ప్రదాని మోదీ నివాసంలో బుధవారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీలోని ప్రదాని మోదీ నివాసంలో బుధవారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

అయితే ప్రభుత్వం ఏర్పాటులో కీలక బాధ్యతలు చంద్రబాబుకు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు సైతం ఈ రోజు జరుగుతున్న ఈ భేటీకి వచ్చారు. అయితే ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మోదీ అందజేశారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్దర్మ ప్రదానిగా కొనసాగాలని మోదీని ఆమె కోరారు. మరోవైపు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ శనివారం బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated at - Jun 05 , 2024 | 05:53 PM