Share News

Buvanagiri: యాదగిరీశుడి జయంత్యుత్సవాలు

ABN , Publish Date - May 21 , 2024 | 03:51 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి.

Buvanagiri: యాదగిరీశుడి జయంత్యుత్సవాలు

  • కన్నులపండువగా శ్రీకారం

భువనగిరి అర్బన్‌, మే 20: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయం తిరువేంకటపతిగా అలంకార సేవతో తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి గరుఢ వాహనంపై పరమవాసుదేవ అలంకార సేవలు నిర్వహించారు.

ఆలయ ఖజానాకు సోమవా రం రూ.56,27,107 ఆదాయం సమకూరింది. కాగా, గుట్ట క్షేత్రంలో సంగీత సభ ల నిర్వహణకు ఆలయ తూర్పు దిశ ఈ శాన్యంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం జరిగే కైంకర్యాల వివరాలు తెలిపేందుకు ఎల్‌సీడీ స్ర్కీన్లను మండపం సమీపంలో సిద్ధం చేస్తున్నారు. ఆలయ విశిష్టతను తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు.

Updated Date - May 21 , 2024 | 03:51 AM