Share News

Road Accident: మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:17 AM

మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..

Road Accident: మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ నుంచి కారులో మారేడుమిల్లికి విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వెంగళదాసు సాయిరాం, రవితేజగా గుర్తించారు. సంగినేని సాయిరాం, లక్ష్మణ్, సాయితేజకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 02 , 2024 | 09:17 AM