Share News

TS News: హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:20 AM

Telangana: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పుట్ట నరసింహస్వామి అనే వ్యక్తి... నల్ల అవినాష్(25)పై కత్తితో దాడి చేశాడు. తన భార్యతో నల్ల అవినాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో నర్సింహులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

TS News: హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 3: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పుట్ట నరసింహస్వామి అనే వ్యక్తి... నల్ల అవినాష్(25)పై కత్తితో దాడి చేశాడు. తన భార్యతో నల్ల అవినాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో నర్సింహులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే అవినాష్ తప్పించుకొని పారిపోవడంతో అవినాష్ తల్లి పద్మపై దాడికి తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2024 | 10:20 AM