Share News

Hyderabad: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య..

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:03 AM

ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్‌ కొలువు.. ఇలా ఏదో ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక, నిరుద్యోగాన్ని భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య..

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్‌ కొలువు.. ఇలా ఏదో ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక, నిరుద్యోగాన్ని భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం, వెంకిర్యాల్‌కు చెందిన నశబోయిన రేవంత్‌(25) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో కొద్ది రోజులు పని చేశాడు. అనంతరం ఆ ఉద్యోగం మానేసి పలు పోటీ పరీక్షలు రాశాడు. వాటిల్లో ఆశించిన ఫలితం రాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ, ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రేవంత్‌ శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించిన రైల్వే పోలీసులు రేవంత్‌ కుటుంబానికి సమాచారం ఇచ్చారు.

Updated Date - Dec 28 , 2024 | 06:03 AM