Road Accident: దైవదర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను లారీ ఢీకొని..
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:43 AM
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందగా.. తండ్రీకూతురికి గాయాలయ్యాయి.

తల్లీకుమారుడి మృతి తండ్రీకూతురికి గాయాలు
భువనగిరి జిల్లా రాయగిరిలో ఘటన
భువనగిరి రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందగా.. తండ్రీకూతురికి గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చంపాపేటకు చెందిన బహిగల్ల జగన్, భార్య పావని (30), కుమారుడు కన్నయ్య (3), కుమార్తె సాత్విక (8) శుక్రవారం యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చారు. దైవ దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు.
భువనగిరి మండలం రాయగిరి సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో పావని అక్కడికక్కడే మృతి చెందింది. కన్నయ్య, జగన్, సాత్వికలను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా.. కన్నయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో సంతో్‌షకుమార్ తెలిపారు.