Tiger Sighting: నల్లమలలో కనువిందు చేసిన పెద్దపులి
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:01 AM
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది.

మన్ననూర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. మన్ననూరు రేంజ్‌లోని పర్హాబాద్ గేటు నుంచి సఫారీ వాహనంలో శనివారం ఉదయం బయలుదేరిన పర్యాటకులు వ్యూ పాయింట్ కు వెళుతున్న క్రమంలో నిజాం నవాబు బంగ్లా పరిసర ప్రాంతంలో రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది.
పర్యాటకులు సెల్‌ఫోన్లలో పెద్దపులి వీడియోలను చిత్రీకరించారు. మరో పులి శుక్రవారం సాయంత్రం పర్హాబాద్ రూట్లో కనిపించింది. పులి కనిపించిన విషయం వాస్తవమేనని మన్ననూరు అటవీ రేంజ్ డీఆర్‌వో రవికుమార్ ధ్రువీకరించారు.