Share News

Republic Day: తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా స్వీపర్, మొబైల్ టాయిలెట్ నిర్వాహకురాలు

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:05 PM

తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళలు రిపబ్లిక్ డే వేడుకలకు అటెండ్ అవుతారు. వారిలో ఒకరు స్వీపర్ నారాయణమ్మ కాగా మరొకరు మొబైల్ షీ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మీ. వీరిద్దరిని రిపబ్లిక్ డే వేడుకల కోసం జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఢిల్లీ పంపించారు.

 Republic Day: తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా స్వీపర్, మొబైల్ టాయిలెట్ నిర్వాహకురాలు

హైదరాబాద్: 75వ గణతంత్ర దినోత్సవం కోసం యావత్ భారత్ సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెప లాడనుంది. ఈ సారి 1500 మంది రైతులు వేడుకలకు హాజరవుతారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వస్తున్నారు. ఎప్పటిలాగే శకటాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళలు రిపబ్లిక్ డే వేడుకలకు అటెండ్ అవుతారు. వారిలో ఒకరు స్వీపర్ నారాయణమ్మ కాగా మరొకరు మొబైల్ షీ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మీ. వీరిద్దరిని రిపబ్లిక్ డే వేడుకల కోసం జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఢిల్లీ పంపించారు.

నారాయణమ్మ

నారాయణమ్మ స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం. గత 22 ఏళ్లుగా గ్రేటర్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. బంజారాహిల్స్‌ కాలనీల్లో నిత్యం రోడ్లను ఊడుస్తుంటారు. సమయం దొరికితే చాలు భజన, భక్తి కార్యక్రమాలకు హాజరవుతారు. జానపద గీతం, రామాయణ, భారతాలను పాటలుగా పాడతారు. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాలు చెబుతారు. నారాయణమ్మ గాత్రం విని ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి నారాయణమ్మ ఈ సారి రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ప్రతినిధిగా హాజరవుతారు.

నాగలక్ష్మీ

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగలక్ష్మీ. ఈమె రెండు డిగ్రీలు చేశారు. గత ఐదేళ్ల నుంచి కోదాడలో మొబైల్ టాయిలెట్ నిర్వాహకురాలిగా సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు ఆటోకు బిగించిన టాయిలెట్‌‌ను ఊరంతా తిప్పుతారు. గుడి వద్ద, బస్టాండ్ దగ్గర, మార్కెట్ వద్ద మొబైల్ టాయిలెట్ ఉంచుతారు. మొబైల్ టాయిలెట్ వాడుకున్న వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఉచితంగా సేవ అందిస్తున్నారు.

ఐదుగురు సర్పంచ్‌లకు ఆహ్వానం

రిపబ్లిక్ డే వేడుకలకు ఐదుగురు మహిళా సర్పంచ్‌లకు కూడా ఆహానం వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఐదుగురికి పిలుపు వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన పాపిశెట్టి శైలజ, ములుగుకు చెందిన ఎం అనితారాణి, నాగర్ కర్నూలు‌కు చెందిన పి సురేఖ, సంగారెడ్డికి చెందిన బక్క రమాదేవి, వికారాబాద్‌కు చెందిన కాంతి లక్ష్మి ఉన్నారు. వీరంతా తమ భర్తలతో కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 05:10 PM