Share News

TGPSC: 27 నుంచి ఏఈల ధ్రువపత్రాల పరిశీలన

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:47 AM

ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్న వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీలో భాగంగా.. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), మునిసిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ అధికారుల ధ్రువపత్రాల

TGPSC: 27 నుంచి ఏఈల ధ్రువపత్రాల పరిశీలన

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్న వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీలో భాగంగా.. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), మునిసిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ అధికారుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ శనివారం వెల్లడించారు. ఈ పరిశీలన 27న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై డిసెంబరు 31వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.


నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఈ షెడ్యూల్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారికి జనవరి 2న వెరిఫికేషన్‌కు మరో అవకాశం ఉంటుందని చెప్పారు. అభ్యర్థుల వివరాలు జ్ట్టిఞ://ఠీఠీఠీ.్టటఞటఛి.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, ఇందులోని చెక్‌లి్‌స్టను డౌన్‌లోడ్‌ చేసుకొని వెరిఫికేషన్‌కు హాజరుకావాలని అభ్యర్థులకు నికోలస్‌ సూచించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:47 AM