IPS Transfers: 10 మంది ఐపీఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:38 AM
తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2021, 2022 బ్యాచ్ యువ ఐపీఎ్‌సలు పదిమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2021, 2022 బ్యాచ్ యువ ఐపీఎ్‌సలు పదిమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా గ్రేహౌండ్స్‌లో ఏఎస్పీలుగా ఇంతకాలం విధులు నిర్వర్తించారు. వీరిలో కాజల్‌ను ఉట్నూరుకు, కె.రాహుల్ రెడ్డిని రాచకొండ పరిధిలోని భువనగిరికి, ఎస్.చిత్తరంజన్‌ను ఆసిఫాబాద్‌కు, బి.చైతన్య రెడ్డిని కామారెడ్డికి, పందెర చేతన్ నితిన్‌ను జనగామకు, విక్రాంత్ కుమార్ సింగ్‌ను భద్రాచలానికి, ఎన్.శుభం ప్రకాశ్‌ను కరీంనగర్‌కు, రాజేశ్ మీనను నిర్మల్‌కు, పి.మౌనికను దేవరకొండకు బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీగా ఉన్న అంకిత్ కుమార్ సంఖ్వార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.