Share News

Secretariat Security: సచివాలయం భద్రత తిరిగి ఎస్పీఎఫ్‌ చేతికి

ABN , Publish Date - Oct 31 , 2024 | 05:55 AM

రాష్ట్ర సచివాలయం భద్రత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

Secretariat Security: సచివాలయం భద్రత తిరిగి ఎస్పీఎఫ్‌ చేతికి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయం భద్రత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ బాధ్యతను తిరిగి తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎ్‌ఫ)కు అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొంతకాలంపాటు సచివాలయం భద్రత ఎస్పీఎఫ్‌ చేతుల్లోనే ఉంది. అయితే సచివాలయ నూతన భవనం నిర్మాణం తర్వాత గత ప్రభుత్వం.. భద్రత విధుల నుంచి ఎస్పీఎ్‌ఫను తప్పించి టీజీఎస్పీకి ఆ బాధ్యతలు అప్పగించింది.


అయితే వివిధ కారణాల వల్ల.. సచివాలయ భద్రత బాధ్యతలను తిరిగి ఎస్పీఎ్‌ఫకు అప్పగించాలంటూ కొత్త ప్రభుత్వానికి డీజీపీ నివేదిక అందజేశారు. ఈ మేరకే ప్రభుత్వం తిరిగి ఎస్పీఎ్‌ఫకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే సచివాలయ భద్రతను అధీనంలోకి తీసుకోవాలంటూ ఎస్పీఎ్‌ఫను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సీఎస్‌ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Oct 31 , 2024 | 05:55 AM