Anila Vavilla: రెడ్కో వైస్ చైర్‌పర్సన్‌గా అనిలా వావిల్ల
ABN , Publish Date - Aug 29 , 2024 | 03:23 AM
విద్యుత్తు రంగంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ రెడ్కో సంస్థ వైస్ చైర్‌పర్సన్, ఎండీగా శ్రీమతి అనిలా వావిల్లను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ప్రస్తుతం ఈ స్థానంలో కొనసాగుతున్న ఎన్.జానయ్యను తక్షణమే ఆమెకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అనిలా వావిల్ల ప్రస్తుతం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.